Home » Singareni CMD: సింగరేణి ఇన్‌ఛార్జ్ సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్..

Singareni CMD: సింగరేణి ఇన్‌ఛార్జ్ సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్..

by Post Editor
0 comments
IAS Krishna Bhaskar Appointed As Singareni CMD

IAS Krishna Bhaskar Appointed As Singareni CMD: సింగరేణి సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ట్రాన్స్ కో సీఎండీగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆయనకు సింగరేణి సీఎండీగా అదనపు భాద్యతలు అప్పగించారు.

సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో సింగరేణికి సీఎండీ (ఎఫ్ఏసీ)గా కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన సింగరేణి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుత ఛైర్మన్ శ్రీ ఎన్. బలరామ్ నుండి బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు సింగరేణి డైరెక్టర్లు, జీఎంలు స్వాగతం పలికారు.

కాగా కృష్ణ భాస్కర్ 2012 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన ఇంతకుముందు రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఇండస్ట్రీస్ శాఖకు డైరెక్టర్ గానూ, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖకు స్పెషల్ సెక్రటరీ గానూ వ్యవహరించారు.

You may also like