Home » ICC T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా స్క్వాడ్ అదుర్స్..

ICC T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా స్క్వాడ్ అదుర్స్..

by Post Editor
0 comments

ICC T20 World Cup 2026 India Squad: 2026 ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్‌నకు బీసీసీఐ టీమిండియా జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్వవహరించనున్నారు. ఇటీవల ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతోన్న శుభ్‌మన్ గిల్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఫినిషర్‌గా వ్వవహరిస్తోన్న జితేశ్ శర్మపై వేటువేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విశేషంగా రాణించిన ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా ఇషాన్.. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకు కవర్‌‌గా వ్వవహరిస్తాడు. అంతేకాకుండా సెకండ్ వికెట్ కీపర్ రోల్ ప్లే చేయనున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో హార్థిక్ పాండ్యా, వాషింగ్‌టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్‌తో సహా ఎంపికయ్యారు. ఇక ఫినిషర్‌గా రింకూ సింగ్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. బుమ్రా, అర్షదీప్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు మోయనున్నారు. స్పినర్లు వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ ఎంపికయ్యారు. ఇక బ్యాటర్ల కోటాలో తిలక్ వర్మ ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మెండి చేయిచూపించారు.

You may also like