26
India vs South Africa 2nd T20I: చంఢీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ముందుగా టాస్ గెలిచి సౌతాఫ్రికాను టీమిండియా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సౌతాఫ్రికా ఓపెనర్ డీకాక్ 46 బంతుల్లోనే 90 పరుగులు చేసి అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. మార్కరమ్(29), ఫెరెరియా(30*) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
214 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా ఆటగాళ్లలో తిలక్ వర్మ(62, 34 బంతుల్లో 5*6, 2X4) చివరి వరకు పోరాడాడు. కానీ మరో ఎండ్ నుండి సహకారం లభించకపోవడంతో టీమిండియా 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లలో బార్ట్‌మన్ 4, సిపమాల 2, ఎంగిడి 2, యాన్సెన్ 2 వికెట్లు తీసుకున్నారు.

