Indian Army proposal for Pinaka Rockets: ఆపరేషన్ సిందూర్ తర్వాత తన లాంగ్ రేంజ్ ఫిరంగి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా, భారత సైన్యం దాదాపు రూ.2500 కోట్ల విలువైన ప్రతిపాదనలో 120 కి.మీ స్ట్రైక్ రేంజ్ గల పినాకా రాకెట్‌లను చేర్చాలని చూస్తోంది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవలి కాలంలో స్వదేశీ మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్‌లను అభివృద్ధి చేసి వాటిని స్నేహపూర్వక విదేశీ దేశాలకు ఎగుమతి చేయాలన్న ప్రతిపాదనలో భాగంగా పినాక రాకెట్‌లను భారత అమ్ముల పొదిలో చేర్చే అంశం తెరమీదకు వచ్చింది.
120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉన్న రాకెట్‌లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేస్తుంది. తాజాగా వీటి మొదటి ట్రయల్స్‌ను సమీప భవిష్యత్తులో నిర్వహించాలని ప్రణాళిక రచించనట్లు రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

