Home » Palvancha: బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే శరణ్యం.. రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..

Palvancha: బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే శరణ్యం.. రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..

by Post Editor
0 comments

Palvancha: పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే శరణ్యం అని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాల్వంచలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కొత్వాల నాయకత్వంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొత్వాల కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేశారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ అనీ, పేద ప్రజలకు అండగా నిలిచి, దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అనీ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించవద్దని కొత్వాల పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, జిల్లా INTUC అధ్యక్షులు SA జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, సాదం రామకృష్ణ, బద్ది కిషోర్, SVRK ఆచార్యులు, Y వెంకటేశ్వర్లు (YV ), చింతా నాగరాజు, కాపర్తి వెంకటాచారి, కనగాల నారాయణ రావు, గంగిరెడ్డి భువన సుందర్ రెడ్డి, పెండ్యాల కృష్ణమూర్తి, బ్యాంకు చారీ, డిష్ నాగేశ్వరరావు, వుండేటి శాంతివర్ధన్, SK చాంద్ పాషా, సందు ప్రభాకర్, జమ్మల శేఖర్, కట్టా సోమయ్య, గంధం నర్సింహారావు, బొశెట్టి సాంబయ్య, పులి సత్యనారాయణ, యమ్మన మల్లిఖార్జున్, కొత్తపల్లి రవి, భూక్యా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like