Home » Canada: టొరొంటోలో భారత విద్యార్థి దారుణ హత్య..

Canada: టొరొంటోలో భారత విద్యార్థి దారుణ హత్య..

by Post Editor
0 comments

Canada: కెనడాలో భారత విద్యార్థి శివాంక్ అవస్థి(20) దారుణ హత్యకు గురైయ్యాడు. టొరంటో విశ్వవిద్యాలయ స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో అవస్థిని కాల్చి చంపినట్లు టొరొంటో పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యపై భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ హత్యపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కళాశాల క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసేసినట్లు పేర్కొన్నారు.

You may also like