Home » IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలం.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌కు రికార్డ్ ధర..

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలం.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌కు రికార్డ్ ధర..

by Post Editor
0 comments
IPL 2026 auction

IPL 2026 Auction Live Updates: ఐపీఎల్ 2026 మినీ వేలం ఆసక్తికరంగా సాగుతోంది. అత్యధికంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ 25.20 కోట్ల రికార్డు ధర పలికాడు. గ్రీన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడగా చివరకు కేకేఆర్ దక్కించుకుంది. ఇక శ్రీలంక బౌలర్ మతీశ పతిరాణ కోసం లక్నో, కోల్‌కతా, ఢిల్లీ పోటీపడగా.. కేకేఆర్ 18 కోట్లకు దక్కించుకుంది.

ఇక అన్‌క్యాప్డ్ ఇండియన్ ఆల్‌రౌండర్లు జాక్‌పాట్ కొట్టారు. ప్రశాంత్ వీర్‌ను చెన్నై 14.20 కోట్లకు సొంతం చేసకుంది. కార్తీక్ శర్మను కూడా 14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. అకిబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 8.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఇండియన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను 7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

వెంకటేశ్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 కోట్లకు కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ బౌలర్ మంగేశ్ యాదవ్‌ను 5.2 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లకు దక్కించుకుంది.

You may also like