34
ICC T20 World Cup 2026: మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్ కప్(ICC T20 WORLDCUP 2026) జరగనున్న విషయం తెలిసిందే. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక దేశాలు ఈ ప్రపంచ కప్‌నకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ క్రమంలో ఐసీసీకి, ప్రసార కర్త జియో హాట్ స్టార్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రపంచ కప్ అధికారిక ప్రసారకర్త బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐసీసీకి జియోహాట్ స్టార్ చెప్పినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రిలయన్స్ ఇండస్టీస్ నియంత్రణలోని జియోహాట్ స్టార్ 2027 వరకు ప్రసారకర్తగా వ్యవహరించడానికి ఐసీసీతో 3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ ఆర్థిక నష్టాల దృశ్యా ఈ ప్రఖ్యాత ప్రసారకర్త ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

