16
Lionel Messi in Hyderabad: గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మెస్సీ నేరుగా ఫలక్‌నూమా ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి ఘనస్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ప్యాలెస్‌లో వంద మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు. మెస్సీతో పాటు ఫుట్ బాల్ ఆటగాళ్లు లూయిస్ సూరెజ్, రోడ్రిగో డీ పాల్ ఉన్నారు. అక్కడ నుండి నేరుగా ఉప్పల్ స్టేడియంకు చేరుకొని షూటౌట్లో పాల్గొననున్నారు.

