Home » Nalgonda: ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. జర్నలిస్టులకు కొల్లోజు శ్రీకాంత్ పిలుపు..

Nalgonda: ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. జర్నలిస్టులకు కొల్లోజు శ్రీకాంత్ పిలుపు..

by Post Editor
0 comments

Nalgonda: తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252లో లోపాలున్నాయని.. వాటిని సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన ఛలో కలెక్టరేట్ కార్యక్రమం తలపెట్టారు. కాగా ఈ ఛలో కలెక్టరేట్ కార్యక్రామాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ నకిరేకల్ నియెజకవర్గం అధ్యక్షలు కొల్లోజు శ్రీకాంత్ తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం 10.30 గంటలకు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను సవరించాలని.. లేదంటే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

You may also like