Nalgonda: కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్ యువ చైతన్య భారీ ర్యాలీ అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని, నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ ప్రాంతానికి బీటీ రోడ్డు వేయిస్తానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకరణ అమలు చేస్తుందని అన్నారు.కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీ వచ్చి మాట్లాడాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. కెసిఆర్ కూతురు కవిత అడిగిన దోచుకున్న వేల కోట్లకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలు ఎన్నికలలో సర్పంచులంతా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కూసుకుంట రాజిరెడ్డి, బద్దం సుధీర్, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

