Narasapur- MGR Chennai Central VandeBharat Express: నరసాపూర్-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్(VandeBharat Express)ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నరసాపూర్ వరకు పొడిగించింది. 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- నరసాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:30 నిమిషాలకు చెన్నై సెంట్రల్‌లో ప్రారంభమయ్యి.. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా 14:10 నిమిషాలకు నరసాపూర్ చేరుకుంటుంది.
తిరుగుప్రయాణంలో 20678 నరసాపూర్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందేభారత్ మధ్యాహ్నం 2: 50 నిమిషాలకు (14:50) నరసాపూర్ నుండి బయలుదేరి రాత్రి 11:45 (23:45) నిమిషాలకు చెన్నై చేరుకుంటుంది.

