BJP Working President Nitin Nabin: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ రాష్ట్ర మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబిన్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానున్నట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
నితిన్ నబిన్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2006లో పాట్నా వెస్ట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి తొలిసారిగా బీహార్ అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన 2010, 2015, 2020, 2025లో బాంకిపూర్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు.
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత నితిన్ నబిన్ స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవ చేసే అవకాశం కల్పించి, నాపై నమ్మకం ఉంచినందుకు బీజేపీ అగ్ర నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Priyanka Gandhi: ఎన్నికల కమిషన్‌పై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు..
కాగా నితిన్ నబిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్త నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారని.. రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

