15
Operation Kagar: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం కేంద్ర బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత, సెంట్రల్ కమిటీ మెంబర్ గణేశ్ ఉయికే అలియాస్ పాక హనుమంతు మృతి చెందారని పోలీసులు తెలిపారు. దీంతో సెంట్రల్ కమిటీలో మరో ఆరుగురు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. చనిపోయిన పాక హనుమంతుపై కోటి పది లక్షల రివార్డ్ ఉంది. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంల గ్రామమని అధికారులు పేర్కొన్నారు.

