Home » Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పీఏసీఎస్, డీసీసీబీల పాలకవర్గాల రద్దు..

Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పీఏసీఎస్, డీసీసీబీల పాలకవర్గాల రద్దు..

by Post Editor
0 comments

PACS DCCB Governing bodies dissolution in Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్వవసాయ ప్రాథమిక సహకార సంఘాలు(PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల పాలకవర్గాలను రద్దు చేసింది. ఈ మేరకు వ్వవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో చివరగా 2020 ఫిబ్రవరిలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరితో ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. పరిపాలనాపరమైన కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ వీరి పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించింది. ఆ గడువు కూడా ముగియడంతో పదవీకాలాన్ని నిరవధికంగా పెంచుతూ ఆగస్టు 14న జీవో విడుదల చేసింది. తాజాగా ఆ జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఏసీఎస్, డీసీసీబీ అధికారులను ఇన్‌ఛార్జీలను నియమిస్తూ తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది.

You may also like