PM Modi conferred with Ethiopia’s highest honour: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారం లభించింది. ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్ అలీ ఆ దేశపు అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందించారు. ఈ సంఘటన రెండు దేశాల మధ్య కీలకంగా వ్వవహరించనుంది. ఈ అవార్డును అందుకున్న మొదటి దేశాధినేతగా ప్రధాని మోదీ చరిత్రలో నిలిచిపోయారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం ఇథియోపియా చేరుకున్నారు. అక్కడి ప్రధాని అబీ అహ్మద్ అలీతో సమావేశమైన మోదీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా తీర్చిదిద్దాలని ఇరువురు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణలు, సాంకేతికత, విద్య, రక్షణ, ఆరోగ్యం, ఆహార భద్రత, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడం, వాటిని బలోపేతం చేయడానికి మార్గాలను ఇరువురు చర్చించారు. ఇరుదేశాల చారిత్రక సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై చర్చించారు.
PM Modi: ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
20

