29
PM Modi Praises Chandrababu: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనపై మంచి ఫీడ్ బ్యాక్ ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగం కావడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధామి మోదీ ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో భాగంగా ప్రధాని మోదీ ఏపీలోని ప్రభుత్వ పాలన, విధానాల గురించి ఆయన మాట్లాడారు.
మరోవైపు ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీలపై గుర్రుగా ఉన్నారు. ఎనిమిది మంది ఎంపీలున్నా.. ప్రతిపక్ష పాత్ర పోషించడంలేదని అన్నారు. సమర్థవంతమైన టీమ్ ఉన్నా కూడా సమస్యలపై స్పందించడం లేదని తెలిపారు. అలాగే జాతీయ పరిణామాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు యాక్టివ్ గా ఉండి, ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

