19
PM Modi Speaks to Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ కాల్లో మాట్లాడారు. వీరివురు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాటిలో వచ్చిన పురోగతి గురించి సమీక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిపామని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కొసం ఇరుదేశాలు కలసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

