Home » Rahul Gandhi: మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం.. ఉపాధిహామి పథకం పేరు మార్పుపై రాహుల్ గాంధీ..

Rahul Gandhi: మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం.. ఉపాధిహామి పథకం పేరు మార్పుపై రాహుల్ గాంధీ..

by Post Editor
0 comments
Rahul Gandhi on MGNREGA Scheme Name Change

Rahul Gandhi on MGNREGA Scheme Name Change: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై తీసుకొచ్చిన కొత్త బిల్లు గాంధీ ఆదర్శాలకు అవమానం అని ఆయన అభివర్ణించారు. తీవ్ర నిరుద్యోగం ద్వారా భారతదేశ యువత భవిష్యత్తును నాశనం చేసిన తర్వాత, నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామీణ పేదల జీవనోపాధిని కూడా నిర్మూలించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

రాహుల్ గాంధీతో పాటు, అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్ – రోజ్‌గర్, అజీవికా మిషన్ (గ్రామీణ బిల్లుపై నిరసన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానించిందని వారు పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఎల్లప్పుడూ మహాత్మా గాంధీ ఆలోచనలను వ్యతిరేకిస్తున్నారని, అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాంటి ఏ చర్యనైనా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

You may also like