Home » Sachin Tendulkar: లియోనెల్ మెస్సీకి క్రికెట్ గాడ్ అదిరిపోయే గిఫ్ట్..

Sachin Tendulkar: లియోనెల్ మెస్సీకి క్రికెట్ గాడ్ అదిరిపోయే గిఫ్ట్..

by Post Editor
0 comments
Sachin Tendulkar Gifts Lionel Messi

Sachin Tendulkar Gifts Lionel Messi: గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ముంబైలో పర్యటించిన లియోనెల్ మెస్సీకి క్రికెట్ గాడ్ సచిన్ టెందూల్కర్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 2011 ప్రపంచకప్ ఫైనల్ జెర్సీని సచిన్, మెస్సీకి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇద్దరి లెజెండ్స్ జెర్సీ నెంబర్ 10 కావడం విశేషం.

ఇక లియోనెల్ మెస్సీ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. సాకర్ వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన ఫుట్‌బాల్‌ను మెస్సీ సచిన్‌కు కానుకగా ఇచ్చారు. ఒకే వేదికపై ఇద్దరు లెజెండ్స్ ఉండటంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక మెస్సీతో వేదిక పంచుకోవడం చాలా ప్రత్యేకమందని క్రికెట్ గాడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Lionel Messi: గోట్ టూర్ ఆఫ్ ఇండియా.. మెస్సీకి దీది క్షమాపణలు..

You may also like