కరాచి:గత కొంత కాలంగా విపరీతంగా జరిగిన ప్రచారం నిజమయింది. ప్రముఖు టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల పెళ్లి పెటాకులయింది. ఇద్దరూ విడిపోయారు. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. సానియా, షోయబ్ ఇద్దరూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.ఇటీవల సానియా మీర్జా పరోక్షంగా తాము విడిపోతున్నామనే విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. ‘విడాకులు బాధాకరం’ అని ఆమె అన్నారు. సానియా, షోయబ్ దంపతులకు 2018 అక్టోబర్ లో ఇజాన్ అనే కొడుకు జన్మించాడు. ఇక సనా జావెద్ విషయానికి వస్తే… పాకిస్థాన్ లో ఆమెకు మంచి నటిగా గుర్తింపు ఉంది. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే. సింగర్ ఉమైర్ జస్వాల్ ను 2020లో ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. వీరు విడిపోవడానికి కారణం మాత్రం ఇంత వరకు వెల్లడి కాలేదు.