OnePlus 13 And Oppo Find X8 series: ప్రముఖ టెక్ బ్రాండ్‌లైన Oppo అండ్ OnePlus కంపెనీలు తమదైన శైలిలో కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు కంపెనీలు తమ రాబోయే ఫ్లాగ్‌షిప్‌లపై పని చేస్తున్నాయి. అందులో Oppo కంపెనీ Find X8 సిరీస్‌ను, OnePlus కంపెనీ OnePlus 13ను ఈ సంవత్సరం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు బ్రాండ్‌ల ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వాటిలో వాటి డిజైన్ రెండర్‌లు, కొన్ని కీలక స్పెసిఫికేషన్‌ల గురించి సమాచారం అందించబడింది.