Home » Goat Tour Of India: మెస్సీతో మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి..

Goat Tour Of India: మెస్సీతో మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి..

by Post Editor
0 comments

CM Revanth Reddy Football Match With Lionel Messi: గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025లో భాగంగా లియోనల్ మెస్సీ శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో గోట్ కప్ పేరుతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ ఆర్ టీం తరఫున బరిలోకి దిగారు. అటు మెస్సీ ఆల్ స్టార్స్ తరఫున ఫీల్డ్ లోకి దిగారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పెనాల్టీతో గోల్ కొట్టారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ టీం ఘనవిజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన ఆర్ ఆర్ టీంకు మెస్సీ గోట్ కప్ అందించారు. ఈ మ్యాచ్ చూడటానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ మంత్రులు హాజరయ్యారు.

You may also like