32
Panchayat Elections in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 23 మండలాల్లోని 542 పంచాయతీలు, 4,527 వార్డుల్లో ఎన్నికల నగారా మోగనుంది. నల్లగొండ జిల్లాలో 10 మండలాల్లోని 244 పంచాయతీలు, 2418 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లోని 158 గ్రామ పంచాయతీలకు.. 1,462 వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 5 మండలాల్లోని 140 గ్రామ పంచాయతీలకు, 1181 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 పంచాయితీలు ఏకగ్రీవం అవ్వగా, 901 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

