Panchayat Elections Second Phase in Telangana: తెలంగాణలో రెండో దశ(Panchayat Elections) పల్లె పోరు కొనసాగుతుంది. మొత్తం 31 జిల్లాల్లోని 193 మండలాల్లో 4,333 గ్రామ పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏకగ్రీవం మినహాయించి మొత్తం 3911 గ్రామ పంచాయతీలు, 29917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండో విడత ఎన్నికల బరిలో 12,834 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు.
ఇక రెండో దశ పంచాయితీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు పోతారంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం విద్యానగర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండంలోని గండుగులపల్లిలో జారే ఆశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేశవాపూర్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read: Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. నల్లగొండలో మోగనున్న నగారా..
ఖమ్మం జిల్లాలో విషాదం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనానగర్ స్వతంత్ర అభ్యర్థి దామాల నాగరాజు ఆదివారం ఉదయం మృతిచెందారు. ఎన్నికల ఒత్తిడి తట్టుకోలేక శనివారం సాయంత్రం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తెల్తవారుజామున మృతిచెందారు.

