కొప్పళ:నూతన పౌరసత్వ చట్టం (సీఏఏ),జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా పద్యం రాసిన కవి సిరాజ్ బిసరళ్లి, దాన్ని ప్రచు రించిన మాధ్యమ సంస్థ సంపాదకుడు రాజభక్షిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గంగావతిలో గత జనవరి 14న కన్నడ సంస్కృతి శాఖ ఏర్పాటు చేసిన అనెగొంది ఉత్సవంలో బిసరళ్లి ఈ పద్యాన్ని పఠించారు. దాన్ని రజబక్షి అదే రోజున సామాజిక మాధ్యమంలో ఎక్కించారు. దీన్ని స్థానిక భాజపా యువ మోర్చా నాయకుడు శివు అరకేరి ఆక్షేపించి, పోలీసులకు ఫిర్యాదు చేసారు. దరిమిలా కవి, సంపాదకులకు వ్యతిరేకంగా భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 505 ప్రకారం కేసు నమోదు చేసి, నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు.