Shivaji Speech in Dandora Movie Success meet: దయచేసి దండోరా సినిమాలోకి తన వ్యక్తిగత విషయాలను లాగొద్దని.. ఈ సినిమా ఆడకపోతే తనదే తప్పు అవుతుంది యాక్టర్ శివాజీ తెలిపారు. దండోరా మూవీ సక్సెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన తన వల్ల సినిమా ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండాలని కోరారు. కావాలంటే థియేటర్‌లో తానే మాట్లాడుతానని స్పష్టం చేశారు.
ఇక దండోరా సినిమా గురించి మాట్లాడిన ఆయన రెండు రోజుల ముందు ప్రీమియర్స్ పడితే సినిమా వేరేలా ఉండేదని అన్నారు. సెన్సార్ వల్ల ఈ సినిమా ఆలస్యమైందని తెలిపారు. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. అమెరికాలో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని.. ఒక్క షో వేసే దగ్గర మూడు షోలు వేశారని తెలిపారు. తెలుగు సినిమాలో అద్భుతమైన నటులున్నారని చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనమని స్పష్టం చేశారు.
దండోరా సినిమాలో షూటింగ్ చేసినన్ని రోజులు కేవలం రెండు గంటలు మాత్రమే పడుకున్నానని.. తన ముఖం లావుగా కనిపించడానికి అలా చేశానని అన్నారు. డైరెక్టర్ అడగకున్నా క్యారెక్టర్ కోసం అలా చేశానని తెలిపారు.

