14
TGSPDCL Notices to Gitam University on Pending Bills: ప్రముఖ గీతం విశ్వవిద్యాలయం ( Gitam University ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రూ. 118 కోట్ల కరెంట్ బిల్లులు పెండింగ్ ఉండటంతో ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. కాగా ఈ నోటీసులపై విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2008 నుంచి బిల్లులు పెండింగ్ ఉంటే విద్యుత్త్ శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.సామాన్య ప్రజలు రూ. వెయ్యి కరెంట్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారని.. అలాంటిది గీతం విశ్వవిద్యాలయానికి ఎందుకు వెసులుబాటు కల్పించారని మండిపడ్డారు. విచారణకు సూపరింటెండెంట్ ఇంజినీర్ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

