11
Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్, రికార్డుల రారాజు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇవ్వాళ న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు అందుకున్నారు. 14 ఏళ్ల వైభవ్‌కు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఈ అవార్డును ప్రతీ ఏటా ధైర్యం, కళలు & సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణలు, సైన్స్ & టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు వంటి రంగాలలో అసాధారణ విజయాలు సాధించిన వారికి అందజేస్తారు. 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు వారికి ఈ అవార్డులు అందజేస్తారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కారణంగానే వైభవ్ ఇవ్వాళ మణిపూర్‌తో జరిగిన బీహార్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌కు కూడా హాజరు కాలేకపోయాడు.

