Home » VIRAT KOHLI: ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. రెండో స్థానానికి ఎగబాకిన కోహ్లీ..

VIRAT KOHLI: ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. రెండో స్థానానికి ఎగబాకిన కోహ్లీ..

by Post Editor
0 comments
Virat Kohli

ICC ODI RANKINGS: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ చెలరేగిపోయిన విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లీ విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి వన్డేలో మునుపటి ఫామ్ కనబరిచాడు. దీంతో రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.

ఇక బౌలర్ల విభాగంలో ఆఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒక టీమిండియా చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల కోటాలో టాప్ టెన్‌లో టీమిండియా ప్లేయర్ ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. అక్షర్ పటేల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక టీమ్ ర్యాకింగ్స్‌లో టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్‌లలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానంలో కొనసాగుతుంది.

You may also like